ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వివిధ దేశాల విద్యార్థులు, ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.. ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది.. ఆపరేషన్ గంగ పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నాలుగు విమానాలు స్వదేశానికి రాగా.. తాజాగా ఐదో విమానం ఢిల్లీకి చేరింది.. ఈ విమానంలో 249 మంది విద్యార్థులు, భారతీయులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది.. విమానంలో భారత్‌కు చేరుకున్న 249 మందిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు.. తెలంగాణకు చెందిన 11 మంది విద్యార్థులు, ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు.. ఐదో విమానంలో ఢిల్లీకి చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
Read Also: Ukraine Russia War: ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ