కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు.…