టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ వివాదంలో చిక్కుకుంది. పూణెలోని రెస్టారెంట్‌పై ఎస్ వియ్ ఎగ్జిస్ట్ ఇండియా అనే ఎల్జీబీటీ క్యూఐఏ ప్లస్ కమ్యూనిటీ తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ రెస్టారెంట్‌లోకి గే, లెస్బియన్, ట్రాన్స్ కమ్యూనిటీ వారిని అనుమతించడం లేదని ఆరోపించింది. అంతేకాదు, కోహ్లీకి చెందిన ఇతర రెస్టారెంట్లు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని దుమ్మెత్తి పోసింది. ఈ ఆరోపణలపై ‘వన్8 కమ్యూన్’ వర్గాలు స్పందించాయి. తమ రెస్టారెంట్లలో ఎలాంటి లింగ వివక్షకు…