రూపాయికి ఏం వస్తుంది. ఒక అగ్గిపెట్టె.. ఒక చాక్లెట్.. అంతకుమించి ఏమీ రావు. కానీ ఏపీలో అక్కడికెళితే ఒక్కరూపాయికి మీ ఆకలి తీరుతుంది. అక్కడ వేడి వేడి ఇడ్లీని కస్టమర్లకు అందిస్తున్న ఈయన పేరు చిన్ని రామకృష్ణ. అందరూ రాంబాబుగా పిలుచుకునే ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఓ చిరు హోటల్ యాజమాని. గత 16 సంవత్సరాలుగా రాంబాబు ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ జనతా హోటల్ నడుపుతున్నాడు. ఐతే ఈ…