కరోనా మహమ్మారి మలేషియా దేశంలో విలయ తాండవం చేస్తోంది. అక్కడ నిన్న ఒక్కరోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నాటికి మలేషియాలో 10,413 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు కోవిడ్ బాధితుల సంఖ్యం 43,63,024కు చేరుకుంది. అయితే వీటిలో విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది ఉండగా, స్వదేశంలో 10,386 మందికి ఈ కరోనా సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ…