జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా పోలీసులకు తొలి ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల పర్యటన సమయంలో రోడ్లపై ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, లాఠీలు చూపించడం, దురుసుగా ప్రవర్తించడం చేయరాదని ఆదేశించారు. తన రాకపోకల కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.