Home
Omar Abdullah
Omar Abdullah News
-
Gen-z Viral Video: మేము “జెన్-జీ” ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
Gen-z Viral Video: భద్రతా సిబ్బందితో ఒక మహిళా వాగ్వాదం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణ ఆంక్షల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో తాను ‘‘జెన్-జీ’’కి చెందిన దానినని చెబుతూ హంగామా సృష్టించింది. ఈ వీడియో ముందుగా కాశ్మీర్‌కు చెందినదిగా ప్రచారం జరిగింది. అయితే, ఇది లడఖ్‌లోని మినిమార్గ్ చెక్ పోస్టు వద్ద జూలైలో చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. నివేదికల ప్రకారం.. ద్రాస్… -
Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir: భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తు్న్న ఆయన బుధవారం శ్రీనగర్‌ను సందర్శించారు. కాశ్మీర్ చేరుకున్న తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం’’ అని ఆయన కీలక ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక అమెరికా రాయబారి కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. శ్రీనగర్‌కు చేరుకున్న వెంటనే, అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి… -
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
Omar Abdullah: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్ పరిస్థితి మారకుంటే , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు కూడా భారత్‌లో తిరిగి కలవాలని కోరుతూ ఈ రోజు వీధుల్లో నిరసన చేసేవారని అన్నారు. శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేపట్టిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం, అరెస్టు కావడం తనను… -
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
Omar Abdullah Divorce: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా దాంపత్య బంధానికి అధికారికంగా ముగింపు పలికింది. దాదాపు 17 ఏళ్లుగా విడిగా జీవిస్తున్న ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోగా, వారి అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అలాగే ఒకరిపై ఒకరు దాఖలు చేసుకున్న అన్ని న్యాయపరమైన కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ కేసును జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ అరధే ధర్మాసనం… -
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు చేశారు. ఎన్సీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.20–30 కోట్ల ఆఫర్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. -
Omar Abdullah: ఉన్నదాన్నే సరిగా చూసుకోవడం లేదు, మీకు కాశ్మీర్ కావాలా..?
Omar Abdullah: కాశ్మీర్‌ను భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని, కాశ్మీర్ పాకిస్తాన్ ‘‘జీవనాడి’’ అని, ఏదో రోజు పాకిస్తాన్లో భాగమవుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ వద్ద ఉన్న ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓకే)నే సరిగా చూసుకోవడం లేదని వారికి కాశ్మీర్ కావాలా.? అని ప్రశ్నించారు. -
Omar Abdullah: ఒక ముస్లిం హిందూ మహిళ ముసుగు తీస్తే పరిస్థితి ఏంటి.?
Omar Abdullah: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక కార్యక్రమంలో ముస్లిం మహిళ హిజాబ్ తీసేయాలని చెబుతూ, లాగడం వివాదస్పదమైంది. ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు ఇస్తున్న కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు, నితీష్ కుమార్‌కు బీజేపీలో కొంత మంది నేతలు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మహిళ నియామక పత్రాన్ని అంగీకరించవచ్చు లేదంటే నరకానికి పోవచ్చు అని వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదమైంది. -
Omar Abdullah: ఇండియా కూటమి ‘‘వెంటిలేటర్’’పై ఉంది.. కాంగ్రెస్ పక్షాల ఆగ్రహం, బీజేపీ హ్యాపీ..
Omar Abdullah: ఇండీ కూటమి పరిస్థితిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ఆందోళన పెంచాయి. ప్రతిపక్ష ఇండీ కూటమి ‘‘లైఫ్ సపోర్ట్‌పై ఉంది’’ అని అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో ప్రతిపక్ష కూటమి గురించి మాట్లాడుతూ.. ‘‘ మనం లైఫ్ సపోర్ట్‌లో ఉన్నట్లే. -
Omar Abdullah: కొందరు చేసిన ఉగ్రదాడికి మొత్తం కాశ్మీరీలకు అవమానాలు..
Omar Abdullah: కొంత మంది చేసిన ఉగ్రవాద చర్యలు కాశ్మీర్ లోయలోని నివాసితులందర్ని కించపరుస్తున్నాయని, అందరూ అనుమానిస్తున్నారని, కాశ్మీర్ నుంచి బయటకు వెళ్లిన వారితో మాట్లాడేందుకు చాలా మంది దూరంగా ఉంటున్నారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. -
Omar Abdullah vs Lt Governor: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ఎల్జీ-ముఖ్యమంత్రి మధ్య రగడ
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా అంశం మళ్లీ రగడ సృష్టిస్తోంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మధ్య తీవ్ర వివాదం మొదలైంది. రాష్ట్ర హోదా విషయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మనోజ్ సిన్హా తీవ్రంగా ఆరోపించారు.
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!