Olympics: ప్రపంచంలో అత్యున్నత క్రీడావేదిక ‘‘ఒలింపిక్స్’’ని భారత్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. భారత ఒలింపిక్స్ అసోసియేషన్(ఐఓఏ) 2036లో భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)కి అధికారికంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ని పంపింది. ఒలింపిక్స్‌ని నిర్వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 2036లో పారాలింపిక్స్ క్రీడలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2036లో భారత్ ఒలింపిక్స్, పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే ప్రధాని నరేంద్రమోడీ కలలకు ఇది అద్దంపడుతోంది. ఒక వేళ ఈ అవకాశం లభిస్తే…