ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. ఒలింపిక్ నగరం టోక్యోలో రికార్డు స్థాయి కేసుల్ని నమోదు చేస్తోంది. తాజాగా 4 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జపాన్ రాజధానిలో నాలుగువేలకు పైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. అలాగే దేశంలో వరుసగా రెండోరోజు 10వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోపక్క ఒలింపిక్ విలేజ్‌లో 21 మందికి కరోనా సోకింది. అక్కడ జులై 1 నుంచి ఇప్పటివరకూ 241 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే..…