ఈనెల 25న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా థియేటర్ల యజమానులకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని.. బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పలు థియేటర్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు…