నిటారైన విగ్రహం, నటనలో నిగ్రహం, వాచకంలో వైవిధ్యం వెరసి ముక్కామల కృష్ణమూర్తిని విలక్షణ నటునిగా నిలిపాయి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ముక్కామల. హీరోగా, విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా మెప్పించారాయన. తెలుగువారి హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించారు ముక్కామల. ముక్కామల కృష్ణమూర్తి 1920 ఫిబ్రవరి 28న గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ ముక్కామల సుబ్బారావు, తల్లి సీతారావమ్మ. ముక్కామల కన్నవారికి కళలంటే…