Oil Tanker Overturned: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్ పీ పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
బ్రిడ్జ్ పై పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్యాంకర్ లో ఇంధనం ఉండటంతో దాదాపుగా 10 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ కు అంటుకున్న మంటలు బ్రిడ్జ్ దిగువ భాగం వరకు చేరుకున్నాయి.