నిత్యావసర వస్తువైన వంట నూనె వినియోగం పెరుగుతోంది. డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో భారత్ వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, భారత్ 2024-25 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్ వరకు) 16 మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. మొత్తం ఖర్చు రూ. 1.61 లక్షల కోట్లు అని పరిశ్రమ సంస్థ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) గురువారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. Also…
SCO Summit: చైనాలో జరుగుతున్న SCO సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్‌లో భాగంగా ముందుగా నేతలతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. అనంతరం అన్ని దేశాధినేతలు సంయుక్తంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాంజిన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులపై…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…
India Fuel Demand: భారతదేశ ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. డిమాండ్ కు తగినట్లుగా ఫిబ్రవరిలో రోజుకు 5 శాతం కంటే ఎక్కువగా ఇంధన వినియోగం పెరిగి రోజుకు 4.82 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇది వరసగా 15వ సంవత్సరం పెరుగుదలను సూచిస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా.. భారత ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్టమని పేర్కొంది.