ఏపీలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం మీద అమిత్ షా నుంచి గల్లీ లీడర్ దాకా బీజేపీ నేతలంతా ఫోకస్ పెట్టారు. ఫ్యాన్ మీద పైచేయి కోసం బీజేపీ బెటాలియన్ మొత్తం దిగిపోతోంది. కానీ.... అదే పార్టీకి చెందిన ఒక్క ముఖ్య నేత మాత్రం ఆ వైపే చూడ్డం లేదట. పైగా సెగ్మెంట్లో గట్టి పట్టున్న నాయకుడు ఆయన. జాతీయ నేతలు వస్తున్నా పట్టించుకోని ఆ నియోజకవర్గ నేత ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?
తెలంగాణ బీజేపీ నేతలు మారారా? లేక వీళ్ళింతే… ఇక మారనే మారబోరంటూ అధిష్టానమే వదిలేసిందా? వచ్చిన ప్రతిసారి క్లాస్ల మీద క్లాస్లు పీకే అమిత్ షా ఈసారి ఏమీ మాట్లాడకుండా వెళ్ళడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? తెలంగాణ నేతల తీరుపై ఢిల్లీ పెద్దలు హ్యాపీనా? లేక ఎలక తోలు తెచ్చి ఎందాక ఉతికినా రంగు మారదన్న సామెతను గుర్తుకు తెచ్చుకున్నారా? టీ బీజేపీలో అసలేం జరుగుతోంది? తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే టార్గెట్గా కసరత్తు చేస్తోంది…
ఏదైతే ఏముంది… కప్పేసుకోండి కండువాలు. అన్నీ మనవే, అంతా మనోళ్లే అంటున్నారు అక్కడ కూటమి లీడర్స్. ఆ నియోజకవర్గంలో కేడర్లేని బీజేపీకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మంత్రసానితనం ఒప్పుకున్నాక తప్పుతుందా…అనుకుంటూ టీడీపీ కార్యకర్తలకే బీజేపీ కండువాలు వేసేస్తున్నారు. ఏదో ఒకటి కానిచ్చేయండని పై స్థాయిలో అంటున్నా… ఠాఠ్… ఆ కండువా మాకెందుని అంటోందట కేడర్. ఎక్కడుందా విచిత్రమైన పరిస్థితి? ఏంటా గోల? ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి…
ఆ నియోజకవర్గానికి ఎవరైనా ఒక్కసారే ఎమ్మెల్యే. రెండోసారి మాత్రం వాళ్ళే దండం పెట్టేసి మరీ వెళ్ళిపోతున్నారట. రెండు ప్రధాన పార్టీలను ఒకే సామాజికవర్గం శాసిస్తోందని, ఎమ్మెల్యేని వాళ్ళే ఫిక్స్ చేస్తారన్నది ఇంటర్నల్ టాక్. వాళ్ళకి చెక్ పెట్టడానికి ఈసారి మరో సామాజికవర్గం పావులు కదుపుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా కులాల కురుక్షేత్రం? తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలప్పుడు అన్ని పార్టీల నుంచి కొత్త ముఖాలే కనిపిస్తుంటాయి. అది ఇది అని…
కూటమిగా ప్రజల్లోకి వెళ్లాల్సిన పార్టీల మధ్య కుంపట్ల రాజుకుంటున్నాయా..? పైకి కన్పించని అగాధమేదో లోలోపల పెరిగిపోతోందా? మోడీ పేరును వాడుకోవడం లేదని బీజేపీ ఫీలవుతుంటే…. ఆ వివాదాలు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని టీడీపీ, జనసేన భయపడుతున్నాయా? ముస్లిం రిజర్వేషన్స్ తుట్టెను కదిపితే… మొదటికే మోసం వస్తుందని గ్లాస్, సైకిల్ భయపడుతున్నాయా? పోలింగ్ ముంగిట్లో జరగబోతున్న పరిణామాలేంటి? లెట్స్ వాచ్. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య పైకి కనిపించనిది ఏదో జరుగుతోందా? అంటే అవును నిజమే కావచ్చన్నది…