ఉమ్మడి విశాఖజిల్లాలో ఒకప్పుడు ఎంపీలు చాలా పవర్ ఫుల్. సుదీర్ఘ అనుభవం, విస్త్రతమైన పరిచయాలతో ఓ వెలుగు వెలిగేవాళ్లు నాయకులు. సీనియారిటీ, సంప్రదాయంగా సీట్లు కేటాయించే విధానానికి తొలిసారి బ్రేకులు వేసింది వైసీపీ. 2019లో అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తెచ్చి గెలిపించుకుంది. వైసీపీ నుంచి విశాఖ ఎంపీగా ప్రముఖ బిల్డర్ MVV సత్యనారాయణ, ఎస్.టి. రిజర్వ్డ్ నియోజకవర్గం అరకు నుంచి గోడ్డేటి మాధవి.. అనకాపల్లి నుంచి డాక్టర్ సత్యవతమ్మ గెలిచారు. ఈ ముగ్గురు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు…