October Progress Report: అక్టోబర్ మాసంలో తెలుగులో మొత్తం 29 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 7 అనువాద చిత్రాలు ఉన్నాయి. విశేషం ఏమంటే దసరా, దీపావళి సందర్భంగా పలు చిత్రాలు ఆయా వారాలలో విడుదలయ్యాయి. అయితే తెలుగు స్ట్రయిట్ చిత్రాలకంటే అనువాద చిత్రమైన ‘కాంతార’నే ఈ నెలలో విజయకేతనం ఎగరేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల ఒకటవ తేదీన ‘బలమెవ్వడు’ మూవీ విడుదలైంది. ఆ తర్వాత దసరా కానుకగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది…