మేషం:- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబ సమేతంగా వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు తమ సమర్థతో అధికారులను మెప్పిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వృషభం:- ఓర్పు, పట్టుదలతో యత్నాలు సాగించండి. ప్రభుత్వ సంస్థలలో పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలెదురవుతాయి. బాధ్యతలు, పనులు ఇతరులకు అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.…