మేషం:- అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు కాళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారభమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. వృషభం:- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు విరమించుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. రుణం తీర్చటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ముందుచూపుతో వ్యవహరించుట మంచిది.…