కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూజివీడు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతలు గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా నూజివీడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నూజివీడు గాంధీ బొమ్మ…
కృష్ణా జిల్లా ఏపీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ హాట్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. తాజాగా నూజివీడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకుల హౌస్ అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. అభివృద్ధికి మేము కారణం అంటే.. మేము కారణం అంటూ ఇరు రాజకీయపార్టీలు సవాళ్లు విసురుకోవడంతో ముందస్తు చర్యగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల నాయకుల సవాళ్ళతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ…