చలికాలంలో దొరికే సింగాడా దుంపలు (Water Chestnuts) ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ను సంపాదించుకుంటున్నాయి. బయటకు నల్లగా బొగ్గుల్లా కనిపించినా, లోపల మాత్రం తెల్లగా, తియ్యగా, పుష్కల పోషకాలు కలిగిన గుజ్జు ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేసే ప్రత్యేక పోషకాలతో నిండి ఉంటాయి. సింగాడాలు తియ్యగా, కాస్త వగరుగా ఉంటాయి. వీటిని ఉడికించి లేదా కాల్చి తింటారు. సలాడ్లు, సూపులు, వంటకాలలో కూడా వేస్తారు. ఎండబెట్టిన తర్వాత పిండి చేసి…