22 మంది డాక్టర్లు, నర్సులపై చర్యలు చేపట్టేందుకు విచారణకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2020లో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన నిర్వాహకాలపై చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి, 2020లో ఏసీబి ఆకస్మిక తనిఖీలో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జూన్ లో ఏసీబీ అధికారులిచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న మంత్రి చర్యలకు ఆదేశించారు. అవినీతి, పాలన వైఫల్యాలు, పర్యవేక్షణ లోపాల్ని గుర్తించారు. ఇన్‌పేషెంట్లపై తప్పుడు లెక్కలు.. మందుల వినియోగాన్ని సరిగా చూపని నర్సులు.. గత ప్రభుత్వ హయాంలో…
ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచవ్యాప్తంగా 'అంతర్జాతీయ నర్సుల దినోత్సవం' జరుపుకుంటారు. ఈ నర్సుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది?.. ఈ సంవత్సరం థీమ్ ఏమిటో తెలుసుకుందాం.
ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం అంటూ గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు, నర్సులకు భరోసా ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా రోగులతో నేరుగా మాట్లాడారు.. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను పలుకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. మీకు మేం ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పారు.. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ,…