దేశంలో సంచలనం రేపిన నుపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నుపుర్ శర్మకు మద్దతు తెలిపారనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఇతరులపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు హత్యలు కూడా జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దాడి జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు
వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ భారత్ లో జరుగుతున్న హింసాకాండపై స్పందించారు. మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత భారత్ లో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మతోన్మాదుల పిచ్చిని చూసి తాను షాక్ అయ్యానని వ్యాఖ్యానించారు. ప్రవక్త ముహమ్మద్ ఈ రోజు జీవించి ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మతోన్మాదుల వెర్రితనాన్ని చూసి అతను షాక్ అయ్యి ఉండేవాడు. మానవుడు,…