Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరెన్ని వాదనలు చేసినా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్‌వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని.. తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నాడు. టీ20 ఫార్మాట్‌లో పాండ్యాకు తిరుగు లేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ఆసియా కప్‌లో…