విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నూజివీడు , శ్రీకాకుళం , ఇడుపులపాయ , ఒంగోలు క్యాంపస్‌లలో ఫీజులు చెల్లించని 4వేల మంది ఆఖరి ఏడాది పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలను ఆర్జీయూకేటీ నిలిపివేసింది. విద్యా దీవెన , వసతి దీవెన పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయినా ఫీజులను తల్లిదండ్రులు చెల్లించలేదు.