స్వర్గీయ నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే కాదు..తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానేత. నటుడుగా, రాజకీయ నాయకుడుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవితాంతం పట్టుదల, క్రమశిక్షణతో జీవించారు. ఎన్టీయార్ ప్రవేశంతో తెలుగు సినీ చరిత్ర గతి మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల మీద రాజకీయ గతిని మార్చింది. సినీ కళాకారుడుగా ఎన్టీ రామారావు చేయని పాత్ర లేదు. పౌరాణిక, జానపథ పాత్రల స్పెషలిస్ట్. రాముడు, కృష్ణుడి వేశం ఆయన మాత్రమే…
వారణాసి లోని కాశీ విశ్వనాధ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం ముగిశాయి. వారణాసి జిల్లా కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. అనుభవజ్ఞులైన న్యాయమూర్తి దీనిని విచారించాలని ఆదేశించింది. సివిల్ వివాదంలోని అత్యంత సున్నితమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, కేసును సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. సీసీపీ నిబంధన 11లోని 7…
నిటారైన విగ్రహం, నటనలో నిగ్రహం, వాచకంలో వైవిధ్యం వెరసి ముక్కామల కృష్ణమూర్తిని విలక్షణ నటునిగా నిలిపాయి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ముక్కామల. హీరోగా, విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా మెప్పించారాయన. తెలుగువారి హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించారు ముక్కామల. ముక్కామల కృష్ణమూర్తి 1920 ఫిబ్రవరి 28న గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ ముక్కామల సుబ్బారావు, తల్లి సీతారావమ్మ. ముక్కామల కన్నవారికి కళలంటే…