కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల అసంతృప్త స్వరాలు పెరిగాయి. అంతకుముందు ఒకరో ఇద్దరూ ఆ విధంగా బయటపడినా.. పిలిచి మాట్లాడటమో.. వార్నింగ్ ఇవ్వడమో చేసేవారు పార్టీ పెద్దలు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల విషయంలో ఏ జరిగిందో పార్టీ వర్గాలు చూశాయి. కానీ.. కేబినెట్‌లో చోటు కోల్పోయిన నాయకులు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు.. ఆధిపత్యపోరుతో నిత్యం వర్గపోరు రాజేస్తున్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఏదో ఒక రూపంలో సడెన్‌గా భగ్గుమంటున్నారు. అసంతృప్త…