కుప్పంలో ఓడిపోయినా టీడీపీ అక్కడ గెలిచి రికార్డు సృష్టించింది. అధినేత కూడా అన్ని వేదికలపైనా ఆ గెలుపు గురించే మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా దుబాయ్ గోల వచ్చిపడింది. దీంతో జెట్ స్పీడులో దూసుకుపోతున్న పార్టీ కాస్తా ఇప్పుడు సైలెంటైంది. దీంతో తమ్ముళ్లలో ఎక్కడలేని అయోమయం ఏర్పడిందట. ఇంతకీ దర్శి టీడీపీలో దుబాయ్ గోల తీరేదెపుడు? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడిపోయారట. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడినా ఆ తర్వాత తొలిసారిగా జరిగిన…