Koti Deepotsavam 2025 Day 7 : హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం శివానుభూతి కాంతులతో తళుక్కుమంది. ఆధ్యాత్మికత, భక్తి, ఆరాధనల అద్భుత సమ్మేళనంగా కోటి దీపోత్సవం 2025 మహోత్సవం ఏడవ రోజు ఘనంగా కొనసాగింది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత విశేషంగా, విశాలంగా భక్తుల మనసులను ఆకర్షిస్తోంది. వేలాది మంది భక్తులు “ఓం నమః శివాయ” నినాదాలతో దీపాలు వెలిగించగా, ఎన్టీఆర్…