మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, పనిభారంతో సతమతమవుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వృషభం : ఈ రోజు ఈ రాశివారు వృత్తినైపుణ్యం పెంచుకునేందుకు కృషిచేయటం ఎంతైనా అవసరం. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉపాధ్యాయులకు…