మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం చెల్లింపులు, పుచ్చుకునే విషయంలో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం…