డిసెంబర్ 2, గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం చెల్లింపులు, పుచ్చుకునే విషయంలో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. అదనపు రాబడి మార్గాలు అన్వేషిస్తారు.
Also Read
- Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
- Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
- Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
- Koti Deepotsavam Day-12: కోటి దీపోత్సవంలో రామేశ్వర వైభవం.. నేడు రామనాథస్వామి కల్యాణం.!
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని వృత్తుల వారికి పరిచయాలు, గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక స్థిరాస్తి విక్రయానికి అడంకులు తొలగిపోగలవు. ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు. ఒక మంచి చేశామన్న భావం సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. గృహనిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
కన్య : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు అచి, తూచి వ్యవహరించడం మంచిది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. దాన, ధర్మాలు చేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు.
తుల : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆత్మీయుని రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్ తినుబండరాలు, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. విద్యార్ధులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీ యత్నాల్లో స్వల్ప చికాకులు, ఆటంకాలు వంటివి ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత వస్తువులను కొనడంవల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
మకరం : ఈ రోజు ఈ రాశివారు దైవ, సేవా, పుణ్యకార్యాలలో నిమగ్నమవుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అయిన వారి కోసం తాపత్రయపడతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తిగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఖర్చులు అధికమవుతాయి. కొంతమంది మిమ్ములను తప్పుత్రోవ పట్టించి లబ్ది పొందటానికి యత్నిస్తారు. దంపతుల మధ్య అరమరికలు, దాపరికం కూడదు. బాధ లాంటి వాటిని వదలి సంతోషకరమైన జీవితాన్ని గడపండి.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి వ్యాపార విషయముల యందు జాయింట్ సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
OTR: ‘నశా ముక్త్ భారత్’ వెనుక కేంద్ర మంత్రి అసలు ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ‘ఎవర్రా వీళ్లంతా..?’ అంటూ జనసైనికుల ఫైర్
-
Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
-
IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
-
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!