మేషం : ఈ రోజు ఈ రాశివారి ఆర్థిక స్థితి కొంతమేరకు మెరుగుపడినా తాత్కాలిక ఇబ్బందులుంటాయి. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మవుతాయి. దైవ, శుభ కార్యాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు అమలు చేస్తారు. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారామవుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు అధికంగానే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు.…