మేషం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒంటరిగా ఏ పని చేయటంక్షేమం కాదని గమనించండి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నడుపుతారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు…