మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాట పడవలసి వస్తుంది. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం, ఆకస్మిక ధనప్రాప్తి వంటి శుభపరిణమాలున్నాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం మంచిదికాడు. వృషభం :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. పెద్దమొత్తం ధనసహాయం క్షేమంకాదు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆత్మీయులతో కలిసి…