అక్టోబర్ 17, ఆదివారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాట పడవలసి వస్తుంది. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం, ఆకస్మిక ధనప్రాప్తి వంటి శుభపరిణమాలున్నాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం మంచిదికాడు.
వృషభం :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. పెద్దమొత్తం ధనసహాయం క్షేమంకాదు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆత్మీయులతో కలిసి విందులు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
మిథునం :- కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయమవుతుంది. కుంటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కిరాణా, ఫ్యాన్యీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం.
కర్కాటకం :- ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. తలపెట్టిన పనులలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను తెచ్చుకుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
సింహం :- షాపులలో పనిచేసే వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. మత్స్య కోళ్ళ గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.
కన్య :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధు మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులున్నా వెసులుబాటు ఉంటుంది. బాకీలు, ఇంటి అద్దెలు తదితర ఆదాయాలను సౌమ్యంగా వసూలు చేసుకోవాలి.
తుల :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. శకునాలు, ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బంధువుల నుంచి సమస్యలు తలెత్తుతాయి.
వృశ్చికం :- గృహోపకరణాల కొనుగోలుకై చేయుయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ముఖ్యుల విషయాలు చర్చకు వచ్చిన వాయిదా వేయండి.
ధనస్సు :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో అంత సఖ్యత ఉండదు. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీపై వచ్చిన అపవాదులు తొలగి గౌరవాభిమానాలు కలుగుతాయి. బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలున్నాయి.
మకరం :- ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి పునఃపరిశీలన, ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో మెళుకువ చాలా అవసరం. రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.
కుంభం :- స్త్రీలకు పని ఒత్తిడి, హడావుడి అధికం. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. భాగస్వామ్య రంగంలో వారికి చికాకులు తలెత్తుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం :- కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
తాజావార్తలు
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!