మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ప్లీడర్లకు, ప్లీడర్ గుమాస్తాలకు సకాలం. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకం. వృషభం: ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాటం పెట్టే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అందరకీ సహాయం చేసి మాటపడతారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.…