జనవరి 26, బుధవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ప్లీడర్లకు, ప్లీడర్ గుమాస్తాలకు సకాలం. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకం.
వృషభం: ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాటం పెట్టే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అందరకీ సహాయం చేసి మాటపడతారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
Also Read
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
మిథునం: స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. గృహ మరమ్మతులు, పనులు పునఃప్రారంభిస్తారు.
కర్కాటకం: స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మార్కెటింగ్, ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి కావడం కష్టతరమవుతుంది.
సింహం: రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. మీకు రాబోయేఆదాయానికి తగినట్లుగా ఖర్చులు సిద్ధిమవుతుంది. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి.
కన్య: వాతావరణంలోని మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వాహనచోదకులకు ఇబ్బందులు తప్పవు, పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహరాలలో పునరాలోన అవసరం. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అసవరం.
తుల: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశలు దక్కుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో, వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితుల అనుకూలతలు ఉంటాయి.
వృశ్చికం: మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. తెలియని ఉత్సాహము ధైర్యము మీలో చోటుచేసుకుంటుంది. మీకు నచ్చని సంఘటనలుకొన్ని ఎదురుకావచ్చు. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ధనస్సు: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తిగా ఉంటుంది. పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. బంధువులను కలుసుకుంటారు. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం.
మకరం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ, కళారంగాల వారికి సన్నానాలు జరుగుతాయి. ఇతరుల సహాయం ఆర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. రావలసిన మొండి బాకీలు ఆలస్యమైనకానీ వసూలవుతాయి.
కుంభం: ఆర్థిక సమస్యలు మెరుగు పడతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి, స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం.
మీనం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. మీ ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. బంధులతో తగాదాలు ఏర్పడువచ్చు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రముఖులను కలుసుకుని బహుమతులు అందజేస్తారు
.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!