గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి కన్నుమూశారు. వయోభారం సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కృష్ణవేణి ఆదివారం (ఫిబ్రవరి 16) ఉదయం తుది శ్వాస విడిచింది. ఆమె వయసు 101 సంవత్సరాలు. సినీ పరిశ్రమకు గొప్ప వ్యక్తులను అందించిన గౌరవప్రదమైన నిర్మాతగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు 1949లో ‘మన దేశం’ అనే సినిమాతో నందమూరి…