AP Govt grants Ticket Hike for RRR : దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ RRR ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా పెద్దల రిక్వెస్ట్ మేరకు ఏపీలో కొత్త జీవో విడుదలైనప్పటికీ అక్కడ 20 శాతం షూటింగ్ జరుపుకున్న చిత్రాలకు మాత్రమే టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని కన్పించింది ప్రభుత్వం. దీంతో కొత్త జీవోపై “రాధేశ్యామ్” పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి.…
RRR రాజమౌళి రాబోయే మాగ్నమ్ ఓపస్ సందడి మొదలైంది. ఇక సినిమాను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ ఫ్యాన్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా చెర్రీ అభిమానులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తారక్ అభిమానులు టిక్కెట్లను భారీగా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చరణ్ ఫ్యాన్స్ బ్రిటీష్ సామ్రాజ్యంలోని అసంతృప్తులను వేటాడే “హంటర్” అని ట్రైలర్ లో ఉన్నట్లుగా…
one more Song Released by Movie Unit of Most Awaited RRR Movie.సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని కళ్ళింతలు చేసుకొని ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీలోని మరో పాట జనం ముందు నిలచింది. “నెత్తురు మరిగితే ఎత్తర జెండా…” అంటూ సాగే ఈ పాట ప్రోమో విడుదలయితేనే అభిమానులు పదే పదే విని ఆనందించారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ‘ఎత్తర జెండా…’ పూర్తి పాట మార్చి 14న విడుదలయింది. ఇలా వచ్చీ రాగానే…
Actor Nandamuri Taraka Ramarao “Kaliyuga Ramudu” Movie Released 40 Years Ago. కథలో పట్టు లేకపోతే, ఎంతటి సూపర్ స్టార్ నటించిన చిత్రమైనా ప్రేక్షకాదరణకు నోచుకోదు. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన చిత్రాలలోనూ అలాంటి సినిమాలు లేకపోలేదు. పైగా ‘రాముడు’ అన్న టైటిల్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ సినిమాలు జనాన్ని నిరాశ పరచిన సందర్భాలు తక్కువే! అలాంటి చిత్రాల కోవకు చెందిన సినిమానే ‘కలియుగ రాముడు’. కె.బాపయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం…
RRR : ఎట్టకేలకు “రాధేశ్యామ్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రిజల్ట్ సంగతెలా ఉన్నా… చాన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరూ “ఆర్ఆర్ఆర్” వైపు చూస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సినిమా ప్రమోషన్లు చేయడానికి జక్కన్న భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘RRR’. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. మార్చి 25న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రెండవ రౌండ్ ప్రొమోషన్లకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం “రాధేశ్యామ్” విడుదలపైనే అందరి దృష్టి ఉంది. ఈ…
తెలుగునాట ‘రాముడు’ అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్.టి.రామారావే! ఇక ‘రాముడు’ టైటిల్స్ లో రూపొందిన అనేక చిత్రాలలోనూ యన్టీఆర్ నటించి అలరించారు. అరవై ఏళ్ళ క్రితం రామారావు అభినయంతో అలరించిన ‘టైగర్ రాముడు’ ఆ కోవకు చెందినదే! జనబాహుళ్యంలో ఉన్న కథలకు సినిమా నగిషీలు చెక్కి చిత్రాలను రూపొందించడం రచయితలకు పరిపాటే! మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూంది చిత్రం. అలాగే కన్నబిడ్డలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న…
జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్…
టాలీవుడ్ ఇప్పుడు రెండ్ బిగ్ మూవీస్ ను వెండి తెరపై చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తోంది. ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మార్చ్ 11న విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కూడా మాములుగా లేదు. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మేనియా ఎలా ఉందన్న విషయాన్నీ తాజాగా ఓ అభిమాని చేసిన పని చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న…
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామా మార్చ్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. ఈ నేపథ్యంలో మరోసారి సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి జక్కన్న సన్నాహాలు చేస్తున్నారు.…