NTR Family Sentiment:ఇటీవల నటరత్న యన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో యన్టీఆర్ కుటుంబానికే 'ఆగస్టు నెల అచ్చిరాదు' అని కొందరు టముకు వేశారు. యన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన రెండు సార్లు ఆగస్టులోనే బర్తరఫ్ కావడంతో ఈ సెంటిమెంట్ బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే చిత్రసీమలో యన్టీఆర్ కు, ఆయన నటవారసులకు కూడా ఆగస్టు నెల అచ్చివచ్చిందనే చెప్పాలి.