'అల్లంత దూరాన, ఐ.పి.ఎల్.' చిత్రాలలో నటించిన విశ్వ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా 'ఎన్త్ అవర్'. రాజు గుడిగుంట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన విశ్వ కార్తికేయ ఇప్పుడు మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో 'అల్లంత దూరాన' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది!