విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ముందు నవ్వినవారే, తరువాత ‘విశ్వవిఖ్యాత’ అన్న పదానికి అసలు సిసలు న్యాయం చేసిన ఏకైన నటరత్నం అని కీర్తించారు! అదీ యన్టీఆర్ సాధించిన ఘనత! ఆయన ఏ నాడూ…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరాముడు మహాభినిష్క్రమణ చేసి అప్పుడే 26 ఏళ్ళయింది. అయినా ఆయనను మరచినవారు లేరు. అన్నగా జనం గుండెల్లో నిలిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు ‘పెద్దాయన’గా నిలచిన నటరత్న యన్టీఆర్ నా అనుకున్నవారిని ఆదుకున్న తీరును ఈ నాటికీ సినీజనం తలచుకుంటూ ఉన్నారు. అలా ఆయన అభిమానంతో వెలుగులు విరజిమ్మిన వారెందరో. తెరపై అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మగా నటించి అలరించారు రామారావు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనే కన్నయ్యగా నటించడమే కాదు, నిజజీవితంలోనూ యన్టీఆర్…
(అక్టోబర్ 14న డాక్టర్ ఆనంద్ కు 55 ఏళ్ళు)నటరత్న యన్.టి.రామారావు, దర్శకులు వి.మధుసూదనరావు కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. యన్టీఆర్ ను అన్నగా జనం మదిలో నిలిపిన ‘రక్తసంబంధం’, రామారావు శ్రీకృష్ణునిగా నటవిశ్వరూపం చూపిన ‘వీరాభిమన్యు’, సైకలాజికల్ డ్రామా ‘గుడిగంటలు’, సస్పెన్స్ థ్రిల్లర్ ‘లక్షాధికారి’ వంటి పలు వైవిధ్యమైన చిత్రాలు యన్టీఆర్, మధుసూదనరావు కాంబోలో అలరించాయి. యన్టీఆర్ ను ఓ విభిన్నకోణంలో చూపిస్తూ మధుసూదనరావు తెరకెక్కించిన చిత్రం ‘డాక్టర్ ఆనంద్’. 1966 అక్టోబర్ 14న…