Osmania University : స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో పరిశోధన, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కోసం ప్రముఖ విద్యా సంస్థలు, అంతరిక్ష పరిశోధనా సంస్థల మధ్య కీలక ఒప్పందాలు కుదురుతున్నాయి. తాజాగా, ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి అనుబంధంగా ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, తదుపరి ఐదేళ్లపాటు ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్సీ, ఓయూ సంయుక్తంగా…