సర్పంచులను ఎక్కువగా అవమానిస్తుంది సీఎం కేసీఆర్ అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల నిధులు సర్పంచులకు సంబంధం లేకుండా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర నిధులు లోకల్ బాడీలకు రావద్దని చెప్పడాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ఖండించాలని పిలుపు ఇచ్చారు. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులను పద్దతి లేకుండా సీఎం కేసీఆర్ వినియోగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఖజానా లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం…