Laurus Labs Paediatric HIV treatment: హైదరాబాద్‌కి చెందిన లారస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్.. ఈ మూడు నెలల్లో కలిపి 234 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంస్థ లాభం 204 కోట్లు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి ఈసారి నికరంగా 15 శాతం ఎక్కువ ప్రాఫిట్‌ను ఆర్జించింది.