మేషం:- అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. చేతి వృత్తి వ్యాపారులకు కలిసివస్తుంది. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. వృషభం: – భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు పుణ్యక్షేత్ర…