వక్ఫ్ చట్టంపై సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకోదని మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి స్పందించారు. శాసనసభ విషయాల్లోకి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు.