Joe Biden - Rishi Sunak: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందం 25వ వార్షికోత్సవం సందర్భంగా జో బైడెన్ మంగళవారం యూకేలోని ఉత్తర ఐర్లాండ్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయనకు స్వాగతం పలికేందుకు బెల్‌ఫాస్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సమయంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అగ్రదేశాల నేతల పర్యటనలో ఒకరినొకరు పట్టించుకోని సంఘటనలు ఎప్పుడైనా చూశామా.?