Southwest Monsoon: దేశంలోకి అనుకున్న విధంగానే నైరతి రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్ 1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని అనుకున్నప్పటికీ రెండు రోజుల ముందుగానే మే 30న కేరళ తీరానికి రుతుపవనాలు చేరాయి.
గత కొద్ది రోజులుగా తీవ్ర వేడితో.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.