బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కొన్ని రోజులుగా దక్షిణాదిలోని ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉత్తర బెంగళూరు, ఉత్తర చెన్నై ప్రాంతాలను వరదలు ముంచె త్తాయి. కోసస్తలైయార్ నదికి వరద పోటెత్తడంతో ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు,కడప, నెల్లూరు పై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, చైన్నై, ఏపీలలో ఇప్పటివరకు 24 మంది మరణించగా, పలువురు గల్లంతైనట్లు జాతీయ విపత్తునిర్వహణ అధికారులు తెలిపారు.…